తన భార్య భువనేశ్వరి గురించి ఆత్మీయపూర్వక ట్వీట్ చేసిన చంద్రబాబు

  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • భార్యతో కలిసి కేక్ కట్ చేసిన ఏపీ సీఎం
  • తన అద్భుతమైన జీవిత భాగస్వామితో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకున్నానన్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను భార్య భువనేశ్వరితో కలిసి ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. "నా అద్భుతమైన జీవిత భాగస్వామితో కలిసి మరో ఏడాదిని పూర్తి చేసుకుంటున్నా. ఆమె నిరంతర మద్దతు, హుందాతనం ఈ జీవిత ప్రయాణాన్ని నిజంగా అర్థవంతం చేస్తున్నాయి" అంటూ తన భార్యపై ప్రేమను వ్యక్తం చేశారు.


మరోవైపు తన భర్త పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి కూడా భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. 'నా కోసం పుట్టావు' అంటూ ఆమె ఎమోషనల్ గా స్పందించారు. చంద్రబాబు కూడా తన ట్వీట్ లో తన భార్యపై అదే స్థాయిలో ప్రేమను వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Chandrababu Naidu
Bhuvaneswari
Chandrababu birthday
Nara Bhuvaneswari
AP CM
Telugu Desam Party
Birthday celebrations
Couple goals
Andhra Pradesh politics

More Telugu News